పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

May 13,2024 22:18

పాలకొండ: స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సోమవారం ఎన్నికల పరిశీలకులు ప్రమోద్‌ మాన్హార్‌ పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లను దగ్గర ఉండి పరిశీలించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈయన వెంట ఆర్వో శుభం బన్సల్‌ తదితరులు ఉన్నారు.

➡️