సీతంపేట: జిలాల్లో పనులు మండలాల్లో ఉపాధిహామీ పనులు లక్ష్యానికి ఆమడ దూరానుంది. గ్రామాల్లో రోడ్లు, ప్రహరీగోడలు, సిసి రోడ్లు, కాలువలు, చెరువులు, వ్యవసాయ పనులను ఉపాధిహామీ చట్టానికి అనుసంధానం చేశారు. ఇలా ప్రతి పనిని ఉపాధి హామీ పథకం ద్వారా చేయిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఆ మేరకు పనులు జరగడంలేదు. జాబ్‌కార్డులున్న వారందరికీ పనులు కల్పించడంలోనూ, పనులు చేసిన కూలీలకు వేతనాలు చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ఈనెలాఖరుతో ముగియనుండడంతో లక్ష్యాన్ని పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి మళ్లే పరిస్థితి ఉంది. ఈ తక్కువ వ్యవధిలో అధికారులు లక్ష్యాన్ని ఏ మేరకు అధిగమిస్తారో వేచి చూడాల్సిందే.మండలంలో 14,16,6 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. 2వేల పనులకు రూ.50 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 1500 పనులకు రూ.32 కోట్ల 24 లక్షలు వేతనదారులకు చెల్లించారు. వీరిలో ప్రతి ఒక్కరికి వంద రోజులు పని కల్పించాల్సి ఉంది. దీంతో పాటు రోజుకు కొలతల ప్రకారం ఆరు గంటలు పనిచేసి సరాసరిగా రూ.257 వేతనదారుడికి గిట్టుబాటు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు సుమారు 7వేల కుటుంబాలకు మాత్రమే వంద రోజులు పని కల్పించారు. ఇంకా 7166 కుటుంబాలకు వంద రోజులు పని పూర్తి కాలేదు. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి 30కు 14,166 కుటుంబాలకు వంద రోజులు ఉపాధి పని కల్పించాల్సి ఉంది. ఈ లక్ష్యం ఈనెలాఖరుకు పూర్తి కావాల్సి ఉంది. మరో 15రోజుల్లో 50శాతం కుటుంబాలకు వంద రోజులు పనిదినాలు కల్పించాలి. సమయం లేకపోవడంతో ఉపాధిహామీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీంతో పాటు ఆరు వారాల పాటు వేతనదారులకు వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా వారం వారం ఉపాధి కూలి వెంటనే చెల్లిస్తే బాగుంటుందని వేతన దారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వేతనాలు చెల్లించాలి గతంలో మాదిరిగా ఏ వారానికి ఆ వారం ఉపాధి కూలీ లకు వేత నాలు వెంటనే చెల్లిం చాలి. ఇప్పటికి ఆరు వారాలుగా వేతనాలు పడలేదు. రోజంతా కష్టపడి పనిచేసినా కూలి రాకపోవడంతో జీవనం కష్టంగా ఉంది. చేసిన పనికి వేతనం ఎప్పుడు వస్తుందానని ఎదురు చూస్తాను.పత్తిక కుమార్, ఉపాధి హామీ వేతనదారుడు, పూతిక వలస.వేతనాల చెల్లింపునకు చర్యలుకూలీలకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం. ఈ నెలాఖరుకల్లా సుమారు 8వేల కుటుంబాలకు వంద రోజులు పని కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఆర్ సాగర్ , ఎపిఒ, సీతంపేట.
