పార్కులో సౌకర్యాలు కల్పించాలి

Nov 27,2024 21:41

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : డాక్టర్‌ సన్యాసిరాజు పార్కులో సౌకర్యాలు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు.. అధికారులను కోరారు. బుధవారం పట్టణంలోని బెలగాంలో ఉన్న డాక్టర్‌ సన్యాసిరాజు పార్కును సిపిఎం బృందం సందర్శించింది. పార్కులో ఉన్న ప్రాథమిక సమస్య లను నాయకులు గుర్తించారు. వ్యాయామ పరికరాలు, పిల్లలు ఆడుకునే ఊయల మరమ్మతులకు గురికావడం, ఉన్న మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండడం, తాగడానికి మంచినీటి సౌకర్యం లేకపోవడం గుర్తించారు. అదే సమయంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు పార్కుకు రావడంతో, గుర్తించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్‌ స్పందిస్తూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, సభ్యులు బంకురు సూరిబాబు, పాకల సన్యాసిరావు పాల్గొన్నారు.

➡️