యాత్రకు వెళ్లి వస్తూ…రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు దుర్మరణం

Apr 13,2025 21:41

ప్రజాశక్తి – బలిజిపేట : యాత్రకు వెళ్లి వస్తూ మరికొద్దిసేపటికీ ఇంటి చేరుకుంటామనుకున్న ఆ తండ్రీ కొడుకు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువాతపడ్డ విషాదకర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ సంఘటకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి…మండల కేంద్రమైన బలిజిపేట గొల్ల వీధికి చెందిన ముడుసు రామయ్య (32), అతని కుమారుడు పవన్‌ (3) ఆదివారం శ్రీకాకుళం జిల్లా గార మండలం వత్సవలసలో జరిగిన రాజులమ్మ యాత్రకు తమ సొంత ఆటో వెళ్లారు. యాత్ర ముగించుకొని రామయ్య తన కొడుకును ఒడిలో కూర్చొండబెట్టుకొని ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. మరికొద్ది సేపటికి ఇంటికి చేరుకుంటామన్న సమయంలో తెర్లాం మండలం కొల్లివలస మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢకొీంది. ఈసంఘటనలో రామయ్య, పవన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే బస్సు ప్రయాణికులు ఆటోలో చిక్కుకున్న తండ్రీ కొడుకులను అతికష్టమ్మీద బయటకు తీశారు. విషయం తెలుసుకున్న బలిజిపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్‌ఐ సింహాచలం కేసు దర్యాప్తు చేస్తున్నారు.బలిజిపేటలో విషాద ఛాయలురోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందడంతో బలిజిపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. రామయ్యకు భార్య భవాని, కుమార్తె రమ్య ఉన్నారు. భర్త, కుమారుడు మృతి చెందాడన్న వార్త విన్న భవానీ కన్నీరుమున్నీరై రోధించింది.

➡️