ప్రజాశక్తి – పాచిపెంట : మండల కేంద్రమైన పాచిపెంటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకూ విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌కు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా పండు మాట్లాడుతూ విద్యా రంగ సమస్యలపై ఈనెల 27 నుంచి 30 వరకు అన్ని మండలాల్లో ధర్నాలు, నవంబర్ 2 నుంచి 4 తేదీ వరకు కలెక్టరేట్ వద్ద దీక్షలు, 6న చలో కలెక్టరేట్ పిలుపుని ఇచ్చామన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పెండింగ్‌లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, డిగ్రీలో మేజర్ మైనర్ ఆన్సర్ విధానాన్ని రద్దు చేయాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు, వర్కర్లను వెంటనే నియమించాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు రూ.3వేలకు పెంచాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తల్లికి వందనం, పూర్తి ఫీజు రీయంబర్స్మెంట్ అమలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఎస్సీ, బిసి పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాలు, గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అదనపు భవనాల నిర్మించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ జి.సింహాద్రి జి.సంజీవ్, రంజిత్, రమేష్, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.కొమరాడ : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డేవిడ్ డిమాండ్ చేశారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని జూనియర్ కాలేజీలో నుంచి రెవెన్యూ కార్యాలయం వద్ద ర్యాలీగా వెళ్లి సీనియర్ అసిస్టెంట్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు కె.ఉదరు, ఎస్.కౌశిక్, కె.దినేష్, కె.విజరు, వినరు, దుర్గాప్రసాద్, అఖిల్, సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు.వీరఘట్టం :స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని , డిగ్రీ కాలేజ్ సొంత భవనం ఏర్పాటు చేయాలని వ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో ధర్నా. తొలుత విద్యార్థులతో కలిసి స్థానిక జూనియర్ కాలేజ్ నుండి రెవెన్యూకార్యాలయం వరకూ భారీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిని అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫై జిల్లాకమిటీ సభ్యుడు హెచ్.సింహాచలం మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు సురేష్, మండల నాయకులు, రాజు, బాలు, దిలీప్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.