ప్రజాశక్తి – జియ్యమ్మవలస : ప్రభుత్వ ఫలాల్లో ఎలాంటి వివక్షత లేకుండా, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయాలని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం మండలంలోని కన్నపుదొరవలసలో ఎంపీపీ బొంగు సురేష్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్టీఆర్ గృహాలు అర్ధాంతరంగా నిలిచిపోయినా, నిర్మాణాల వీలైనంత త్వరగా పూర్తి చేస్తే వారికి బిల్లులు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపిడిఒ కె.రామారావు, గృహ నిర్మాణశాఖ ఎఇ ఎల్.ఉమామహేశ్వరరావు, కూటమి నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.సాలూరు రూరల్ : మండలంలోని మామిడిపల్లిలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం జరిగింది. ఇన్‌ఛార్జి హౌసింగ్ పీడీ జి.కేశవ నాయుడు లబ్ధిదారులతో మాట్లాడుతూ గతంలో మంజూరైన ఇళ్లను మార్చి 31 నాటికి పూర్తి చేయాలని, అలా పూర్తి చేయని వారికి మిగతా బిల్లులను నిలిపివేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ వర్షాకాలంలో ఇసుక దొరకడం లేదని, మెటీరియల్ ఖరీదు కూడా ఎక్కవ వుందని, మేస్త్రీలు అందుబాటులో లేదని తెలపగా డిఇ సోమశేఖర్‌తో లబ్ధిదారులకు సంబంధించిన ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ బి.అప్పలనాయుడు, టిడిపి నాయకులు బూస తవుడు, తాడుతూరి తిరుపతిరావు, సువ్వాడ రామకృష్ణ, త్రినాధ్, సచివాలయం సిబ్బంది రాజు, లబ్ధిదారులు పాల్గొన్నారు.మక్కువ : మండలంలోని చెముడులో శనివారం నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు జి.వేణుగోపాలనాయుడు మాట్లాడుతూ మండలంలో నిర్మించిన కాలనీలన్నింటి కంటే చెముడులో చేపట్టిన ఇళ్ల నిర్మాణం బాగుందని కొనియాడారు. స్థలం ఎంపికలో సర్పంచ్ బొంగు రాజేశ్వరి చొరవను ఆయన కొనియాడారు. మండలంలో 526 పెండింగ్ గృహాలు ఉన్నాయని హౌసింగ్ ఎఇ సింహాచలం తెలిపారు. వీటన్నింటిని అధికారులు సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎంఇఒ-2 శ్యాంసుందర్, తూరు మామిడి సర్పంచ్ కృష్ణంనాయుడు, స్థానిక ఎంపిటిసి గోపాలకృష్ణ మండలంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని విక్రంపురంలో మన ఇల్లు మనగౌరవం కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు ఉదయాన ఉదయభాస్కర్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో మంజూరైన గృహాలకు సంబంధించి బిల్లులందక అర్ధాంతరంగా నిలిపి వేశారని తక్షణమే పనులు ప్రారంభించాలని ఇందుకు బిల్లులు కూడా చెల్లింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు, ఎంపిటిసి సభ్యులు పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, ఎంపిడిఒ వై.వెంకటరమణ, గృహ నిర్మాణశాఖ ఎఇ వి.వినోద్‌కుమార్, మాచర్ల గీతానందీశ్వరరావు, ఎం.అప్పలనాయుడు, మాచర్ల అనిల్, కె.లక్ష్మణ్, ఎం.వెంకటరమణ, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు, లబ్ధిదారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.కురుపాం : ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో నిర్మాణాలు పూర్తిచేయాలని ఎంపిడిఒ ఎస్.అప్పారావు అన్నారు. స్థానిక సచివాలయంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.రవణమ్మ, హౌసింగ్ ఎఇ జి.అచ్యుతమ్మ, వర్క్ ఇన్స్పెక్టర్ ఎస్.రాజేష్, కూటమి నాయకులు కోలా రంజిత్ కుమార్, కెవి కొండయ్య, ఎన్.వంశీ, జివి రమణమూర్తి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.సీతంపేట :మండలంలోని గొయిదిలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మహమ్మద్ గియాజుద్దీన్, హౌసింగ్ ఎఇ వెంకటేష్ లబ్ధిదారులతో బిల్లుల మంజూరు ఆలస్యం జరగదన్నారు. మండలంలో పిఎం ఆవాస్ యోజన పథకం కింద 1109 ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 149 పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి త్వరితగతి పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో గొయిది శిలగాం, దారభ పంచాయతీల సర్పంచులు, ఎంపిడిఒ కె.గీతాంజలి సీతంపేట, వెలుగు సిసి అనంత, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.సీతానగరం: స్థానిక రాజా కాలనీలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి ఎంవి కరుణాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నాటికి లబ్ధిదారులంతా ఇళ్లు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఎఇ జానకీరాం, పెదభోగిలి సర్పంచ్ జె.తెరేజమ్మ, ఉప సర్పంచ్ కె.అరవింద్ కుమార్, గ్రామ పెద్దలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు