ఏజెన్సీలో జనసేన అభ్యర్థి ప్రచారం

Apr 12,2024 21:26

సీతంపేట : గ్లాస్‌ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని పాలకొండ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు. మండలంలోని చిన్నబగ్గ, కీసరజోడు పంచాయితీలో శుక్రవారం ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. టిడిపి, బిజెపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో సూపర్‌ సిక్స్‌ పథకాలను మహిళలకు వివరించారు. కార్యక్రమంలో సీతంపేట మండల టిడిపి అధ్యక్షులు సవర తోట ముఖలింగం, సీనియర్‌ నాయకులు వెన్నపు శ్రీను, బిజెపి మండల నాయకులు ఆరిక అమల, సీతంపేట జనసేన నాయకులు బిడ్డిక విశ్వనాథం, ఆర్‌.రంగనాథం, తోయిక సంధ్యారాణి, ఐటిడిపి కోఆర్డినేటర్‌ ఇమరక పవన్‌, జనసేన, బిజెపి, టిడిపి శ్రేణులు యువత పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్నారు.

➡️