పాలకొండ: రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరాయమ్మ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక శ్రీరామ డిగ్రీ కాలేజీ ఆవరణలో సోమవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలపూల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ప్రస్తుత పాలకులు విధానాలను రూపొందిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే అత్యంత ప్రమాదకరమైన ధోరణి అని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భావ ప్రకటన, మత స్వేచ్ఛను హరించే విధానాలు రూపొందించడం దుర్మార్గమైన చర్యలని విమర్శించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారం చేపట్టిన వారే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మతోన్మాద చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతుందన్నారు. కార్మిక చట్టాలను మార్చివేసి ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి నిరుద్యోగాన్ని పెంచుతుందని తెలిపారు. మోడీ పాలనతో రాజ్యాంగానికి ప్రమాదం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఉంటేనే ప్రజలకు రక్షణ ఉంటుందన్నారు. ఇప్పటికైనా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడి, పరిరక్షణకు ప్రజలంతా ఉద్యమించాలని, అదే అంబేద్కర్‌కు అర్పించిన ఘనమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, నాయకులు బి.అమరవేణి, దూసి దుర్గారావు, ఎ.లక్ష్మణరావు, ఎ.భానుచందర్, ప్రజాసంఘాల నాయకులు కె.పార్వతి, ఎన్.ఈశ్వరమ్మ, బి.అరుణ, ఎన్.దరిశమ్మ, జి.శారద తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురం టౌన్ : పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి ఇందిరా కాలనీ వరకు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం మెయిన్ రోడ్డుపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కై ఉద్యమిద్దామని, రాజ్యాంగ విలువలను కాపాడదామని సిఐటియు జిల్లా కార్యదర్శి బివి రమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి పాకల సన్యాసిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చీపురుపల్లి సింహాచలం, నాగవంశం శంకరరావు అన్నారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు మామిడి శివ, గండ్రెటి గంగరాజు, బంగారి రాజేష్, పడాల ఇప్పలమ్మ, బంగారు లీల తదితరులు పాల్గొన్నారు.సాలూరు రూరల్ : సిఐటియు నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ నాయకులు రాముడు, శంకర్రావు, శ్రీను రవి లక్ష్మి పోలరాజు, కార్మికులు పాల్గొన్నారు.కొమరాడ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, ఆటో యూనియన్ నాయకులు బి.గోపి, భవన కార్మిక సంఘం నాయకులు మన్మధరావు, ఎస్ గిరిజన సంఘం నాయకులు రమేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, భవన కార్మికులు, గిరిజన యువకులు పాల్గొన్నారు.బలిజిపేట: మండలంలో బలిజిపేట, గుడివాడ కాలనీలో అంబేద్కర్ విగ్రహాలకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మధరావు పూలదండ వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గేదెల సత్యనారాయణ, ప్రజాసంఘాల నాయకులు చంటి, ఆదినారాయణ, సుధామ తౌడు తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట: కెవిపిఎస్ నాయకులు జి ప్రసాద్, గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్ని రామయ్య, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు పాచిపెంటలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గుమ్మలక్ష్మీపురం: మండలంలోనిబొడ్లగూడలో అంబేద్కర్ జయంతి సభ సందర్భంగా మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌వై నాయుడు, మండల నాయకులు మండంగి శ్రీను మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారానే ఎస్‌సి, ఎస్‌టి, బిసిల హక్కులు ముందుకు వెళతాయన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మండంగి శ్రీహరి, కిల్లక రాంప్రసాద్, కోలక దినేష్, కోలక గిరి, మండంగి విజయ, మండంగి చార్మి పాల్గొన్నారు.
