స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం చేయండి

Oct 28,2024 21:23

సీతానగరం : నవంబర్‌ 3న పార్వతీపురం జిల్లా కేంద్రంలో జరుగు యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ మహాసభను విజయవంతం చేయాలని యుటిఎఫ్‌ సీతానగరం మండల శాఖ విజ్ఞప్తి చేసింది. మండల శాఖ ప్రతినిధులు సోమవారం మండలంలోని పలు పాఠశాల లను సందర్శించి ఉపాధ్యాయులను ప్రత్యక్షంగా కలుసుకొని కార్యక్రమా నికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం పోరాడుతున్న యుటిఎఫ్‌ బలోపేతానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పల్లి శ్రీనివాసరావు, బి.ప్రసాదరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మర్రాపు గోవిందరావు, తెర్లి అప్పలనాయుడు, బూరాడ ఆదినారాయణ, ట్రెజరర్‌ డివి రమణ, మండల కార్యవర్గ సభ్యులు నాగులకొండ త్రినాథ్‌, దాలయ్య, జాగాన సింహాచలం పాల్గొన్నారు.

➡️