‘సదరం’ను సద్వినియోగం చేసుకోండి

Nov 29,2024 21:51

ప్రజాశక్తి – కురుపాం : వికలాంగులు, వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన సదరం శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద హైదరాబాదుకు చెందిన అలిమ్‌ కో సంస్థ, ఎస్‌ సొసైటీ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉపకరణాలు గుర్తింపు శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో గుర్తించిన వారికి రెండు నెలల్లో ఉపకరణాలు అందజేస్తామన్నారు. కావున నియోజకవర్గంలో గల ఐదు మండలాల వయోవృద్ధులు, వికలాంగులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐదు మండలాల నుంచి 161 మంది ఉపకరణాలు పొందేందుకు అర్హత పొందాలని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమశాఖ ఎడి కె .కవిత, మండల ప్రత్యేక అధికారి రామచందర్రావు, ఎంపిడిఒ జె.ఉమామ హేశ్వరి, తహశీల్దార్‌ ఎం.రవణమ్మ, ఇఒపిఆర్‌డి జి.రమేష్‌ బాబు, టిడిపి నాయకులు కోలా రంజిత్‌కుమార్‌, మండల కన్వీనర్‌ కె.వి కొండయ్య, ఎస్‌.సొసైటీ కార్యదర్శి షేక్‌ గౌస్‌, అలిమ్‌ కో సంస్థ ప్రతినిధులు వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️