నగర పంచాయతీ చైర్మన్‌గా మల్లేశ్వరి బాధ్యతలు స్వీకరణ

May 5,2025 21:33

పాలకొండ : స్థానిక నగర పంచాయతీ చైర్‌పర్సన్‌గా రెండో వార్డ్‌ కౌన్సిలర్‌ ఆకుల మల్లేశ్వరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కోట దుర్గ ఆలయం నుండి స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ నగర పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని, తాను పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. మల్లేశ్వరి మాట్లాడుతూ చైర్మన్‌గా ఎన్నికైనందునందుకు తన సహకరించిన ఎమ్మెల్యే కౌన్సిలర్లు కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావు, కమిషనర్‌ రత్నంరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, జాడ శ్రీధర్‌, ఆకుల కుమార్‌ తదితరులు ఉన్నారు. అయితే వైసిపి కౌన్సిలర్లు ఈ ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు.

➡️