మండల స్థాయి చెకుముకి పోటీలు విజయవంతం

Oct 1,2024 21:28

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జనవిజ్ఞాన వేదిక మన్యం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మంగళవారం 15 మండలాల్లో మండల స్థాయి చెకుముకి పరీక్ష నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక మన్యం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొండపల్లి గౌరునాయుడు, సార్తి మహేశ్వరరావు తెలిపారు. 15 మండలాల్లో 450 మంది విద్యార్థులు, టీముకు ముగ్గురు చొప్పున 150 మంది పరీక్షకు హాజరైనట్టు వారు తెలిపారు. మండల స్థాయి పరీక్షలో ప్రథమ స్థానం పొందిన టీం ఆ మండలం నుంచి అక్టోబర్‌ 27న జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి పరీక్షకు అర్హత సాధించినట్లు వారు తెలిపారు.మక్కువ : చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌లో భాగంగా మండలంలో చెకుముకి సైన్స్‌ టాలెంట్‌ టెస్ట్‌ మండల స్థాయి పరీక్ష స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. మొదటిగా సెప్టెంబర్‌ 25న పాఠశాల స్థాయిలో మండలంలో గల అన్ని ఉన్నత పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్ష నిర్వహించగా, 580 మంది విద్యార్థులు హాజరయ్యారు. వివిధ పాఠశాలల్లో ఆయా తరగతుల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు మంగళవారం బహుమతులు అందజేశారు. మక్కువ విద్యార్థుల జట్టు ఆర్‌.జ్యోత్స్న, కె.శిరీష, బి.కావ్య మొదటి స్థానంలో నిలవగా, శంబర పాఠశాల విద్యార్థులు సిహెచ్‌ చిరంజీవి, ఎస్‌.అనూష, జి.అక్షయ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు ఎంఇఒలు బహుమతులనుఅ ందజేశారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఆర్‌.రమేష్‌, జి.రామారావు, ఎస్‌.రాంబాబు, వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సీతానగరం : స్థానిక జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో చెకుముకి వేడుకలు ఘనంగా ముగిసాయి. మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా, నిడగల్లు జెడ్‌పి ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల ప్రథమ స్థానాన్ని కైవశం చేసుకున్నారు. ఇందులోభాగంగా పదో తరగతికి చెందిన కె.ప్రవీణ్‌ కుమార్‌, 9వ తరగతి చదువుతున్న వి.అనుష్క, 8వ తరగతికి చెందిన వి.సంజన విజేతలుగా నిలిచారు. వీరికి ఆర్‌కె జూనియర్‌ కరస్పాండెంట్‌ పూడి రామకష్ణ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెవివి ఉపాధ్యక్షులు రేవళ్ల సతీష్‌ రాజు తెలిపారు.భామిని : స్థానిక ఆదర్శ పాఠశాలలో మంగళవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్‌ పోటీలు నిర్వహించారు. ఈ మండల స్థాయి చెకుముకి సైన్స్‌ పోటీల్లో ఆదర్శ పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్‌ రఘు పాత్రను శివకుమార్‌ తెలిపారు. మండల స్థాయి పోటీలు అనంతరం ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.వీరఘట్టం: స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల (బాలుర)లో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ మహేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు సూరు సతీష్‌ ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సంబరాలు పరీక్ష నిర్వహించారు. పరీక్ష పత్రాలను ఎంఇఒ ఆనందరావు, పాఠశాల హెచ్‌ఎం బి.సుంబర, జెవివి నాయకులు ఆవిష్కరించారు. ఈ పరీక్షలు గెలుపొందిన విజేతలు ఈనెల 27న పార్వతీపురంలో జరిగే జిల్లా హాజరౌతారని నిర్వహకులు తెలిపారు. జిల్లాస్థాయి పరీక్షకు ఎంపికైన నర్సిపురం, మహర్షి హై స్కూల్లో విద్యార్థులను ఎంఇఒలు గౌరు నాయుడు, ఆనందరావు, జెవివి జిల్లా అధ్యక్షులు కొండపల్లి గౌరు నాయుడు, ప్రధాన కార్యదర్శి ఎస్‌.మహేశ్వరరావు, ఉపాధ్యక్షులు బి.గౌరీశ్వరరావు, మండల ఇన్చార్జి సూరు సతీష్‌ అభినందనలు తెలియజేశారు.

➡️