రామోజీ రావు మృతికి పలువురు సంతాపం

Jun 8,2024 21:44

పార్వతీపురంరూరల్‌ : భారత దేశ మీడియా రంగంలో అగ్రగణ్యులు, ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీ రావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడెమీ చైర్మన్‌ అదపాక సత్యారావు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మీడియా రంగాన్ని సరికొత్త ధోరణుల్లో ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిన రామోజీరావు మరణం దేశం లోని మీడియా రంగానికి, ప్రత్యేకంగా ఈనాడు గ్రూప్‌ సంస్థలకు తీరనిలోటని ఒక ప్రకటన లో పేర్కొన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సత్యా రావు ప్రకటించారు.పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ సంతాపం పాలకొండ : ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌ పురస్కార గ్రహీత రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సంతాపం తెలిపారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సిఐటియు సంతాపంఈనాడు సంస్థల అధిపతి, ప్రముఖ వ్యాపారవేత్త రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ సుపరిచితుడైన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల సిఐటియు పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలుగు జర్నలిజంలో ఎంతో కృషి చేశారు. తెలుగు సాహిత్యరంగానికి, భాషాభివృద్ధికి తోడ్పడ్డారాన్నరు. వామపక్ష ఉద్యమాలకు తోడ్పడేవారని ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు జర్నలిజానికి తీవ్ర లోటని, వారి మృతికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.టిడిపి ఆధ్వర్యాన…ప్రపంచంలోని ఉన్న తెలుగువారంతా గర్వించదగ్గ వ్యక్తి రామోజీరావు అని పట్టణ టిడిపి అధ్యక్షులు గంటా సంతోష్‌ అన్నారు. రామోజీరావు మతి కి సంతాపం తెలుపుతూ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సుంకర అనీల్‌ దత్‌, హనుమంతు తమ్మరావు, అడపా బాబ్జీ నాయుడు తదితరులు ఉన్నారు.కురుపాం :ఈనాడు-ఈటీవీ అధినేత రామోజీరావు మృతికి సంతాపంగా శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో పాత్రికేయులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, టిడిపి నాయకులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల టిడిపి కన్వీనర్‌ కొండయ్య, పలు సంస్థల పాత్రికేయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : తెలుగు పత్రికా రంగానికి మచ్చు తునకగా ఎనలేని కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటని గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రెస్‌ క్లబ్‌ సభ్యులు అన్నారు. ఏజెన్సీ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం ఆయన చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. మీడియా రంగాన్ని సరికొత్త ధోరణిల్లో ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లిన ఘనత రామోజీరావుకు దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ గౌరవ అధ్యక్షులు పైడా కొండలరావు, అధ్యక్షులు సరిపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు పాలక ప్రేమానందు, కార్యదర్శి బేత కుమారస్వామి, జర్నలిస్ట్‌ సభ్యులు కె.రాము, శంకరరావు, కె.వెంకటరావు, శ్రీనివాస్‌, టి.వినోద్‌, రాజా, నాని, ఎఎస్‌ఎం రాజు ప్రకాష్‌, కిషోర్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.కొమరాడ : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని టిడిపి మండల అధ్యక్షులు ఎస్‌ శేఖర్‌ పాత్రుడు అన్నారు. మండలంలోని మాదలింగిలో రామోజీ చిత్రపటానికి పూనమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పత్రికా రంగంలో విలువైన రాతలు రాసి సమాజాన్ని మార్పునకు ఎంతో కృషి చేశారని కొనియాడారు. రామోజీరావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలియజాతి కీర్తిని మరింత ఉన్నత స్థానంలో ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు అని ఆయన పేర్కొన్నారు.

➡️