సాలూరు రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ క్రీడా ఎంపికల్లో స్త్రీ, శిశు సంక్షేమం, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పోటీలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో వాలీబాల్ చేపట్టి ఆటలు ఆడి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, జిల్లా స్థాయిలో ఎంపికైన జట్లను రాష్ట్ర స్థాయికి పంపిస్తామని, వారికి ఆర్థికంగా ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని ఆటల్లో మంచి ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.