గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురంలో గల ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. బిత్ర పాడు నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని కోరారు. వీటితో పాటు తాగునీరు, రోడ్లు తదితర సమస్యలపై ప్రజలు వినతులు ఇచ్చారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని అన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు.
