గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. మండలంలోని లక్కగూడలో సోమవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఆమె ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను ఈనెల 20 నుండి 31 వరకు నిర్వహిస్తుందని, పశువైద్యులు రైతుల వద్దకే వచ్చి పశువులకు, మేకలకు వైద్యమందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని పశు, గొర్రెల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జెడి మన్మధ రావు, స్థానిక సర్పంచ్ సూర్యారావు, జనసేన నియోజకవర్గం సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, స్థానిక సీనియర్ నాయకురాలు కడ్రక కళావతి, పశు వైద్యాధికారి లక్ష్మణరావు, టిడిపి నాయకులు భూషణ్, రాజేష్, మన్మధ, పశు సంవర్ధకశాఖ , సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.కురుపాం: ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ ఏడి అశ్వద్ధామ కోరారు. మండలంలో కురుపాం, పెదగొత్తిలిలో సోమవారం జరిగిన పశు ఆరోగ్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరం పాడి రైతులకు ఎంతగానో దోహదపడతాయని కావున ప్రతి ఒక్క పాడి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెటర్నరీ వైద్య అధికారి కె.శైలజ, మండల టిడిపి కన్వీనర్ కొండయ్య, ఎఎంసి మాజీ చైర్మన్ కోలా రంజిత్ కుమార్, మాజీ ఎంపిపి రమణమూర్తి, టిడిపి నాయకులు కర్రి శ్రీను, రామకష్ణ, మిన్న, సాయి, విజరు , పాడి రైతులు పశు సంవర్ధక శాఖ సిబ్బంది పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్ : జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తున్న పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కృష్ణపల్లి, వెంకంపేటలో పశు ఆరోగ్య శిబిరాలను ఆయన ప్రారంభించారు. పశువుల్లో వచ్చే సాధారణ రోగాలతో పాటు అంటు రోగాలను, నట్టల నివారణ మందులను ఎప్పటికప్పుడు వేసుకొని పాడిపశువుల ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండాలన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ అందించే పశుగ్రాసాలను వినియోగించుకోవాలని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పెదబొండపల్లి, ఎమ్మార్ నగరం, నర్సిపురం పశు వైద్యులు డాక్టర్ చక్రధర్ రావు, డాక్టర్ రెడ్డి రమేష్, డాక్టర్ జై రాము పాల్గొన్నారు. గరుగుబిల్లి: మండల పశుసంవర్ధక ాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి ఉరిటి రామారావు అన్నారు. మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాన్ని మండలంలోని మరుపెంటలో ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచి ఉరిటి నిర్మల మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎస్ సురేష్ కుమార్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.సీతానగరం: మండలంలోని సూరంపేట, మరిపివలస, చిన్నరాయుడుపేట, గెడ్డలుప్పి, కొత్తవలసలో ఉచిత పశు వైద్య శిబిరాలు ప్రారంభయ్యాయి. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఎడి సిహెచ్ దీన కుమార్ మాట్లాడుతూ ఈ శిబిరాల్లో పశువులకు ఎటువంటి వ్యాధులున్నా వాటిని గుర్తించి వైద్యం అందించి మందులు ఇస్తామన్నారు. ఈ శిబిరాల్లో 281 పశువులకు టీకాలు మందులు ఇచ్చామన్నారు. బలిజిపేట మండలం మిర్తివలస, వెంగాపురంలో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి ఎస్.రామారావు, సిహెచ్ గణేష్, పశు వైద్య సిబ్బంది, ఆయా గ్రామ సర్పంచులు, రైతులు పాల్గొన్నారు. సీతంపేట : సీతంపేట, భామిని మండలాల్లో ఈనెల 20 నుంచి 31 వరకు పశువు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. అందులో భాగంగా మండలంలో సోమవారం కుసిమి, మానాపురం, జామి తోట గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించారు. మానాపురంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ పశువ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువు ఆరోగ్య శిబిరాలు పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు. రైతులకు ముంగిట్లో పశువైద్య శిబిరం వచ్చిందని దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పశువులకు సంబంధించి అన్ని టీకాలు ఉచితంగా వేస్తామన్నారు. రైతులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువు వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ధోను భాయి వైద్యాధికారి డాక్టర్ శంకర్రావు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.