ప్రజాశక్తి – భామిని : క్షేత్ర స్థాయి సమస్యలు దశలు వారి పరిష్కారానికి దృష్టి సారిస్తానని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. మండలం కేంద్రంలో సోమవారం టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భామిని మండల పరిధిలో రెవెన్యూ, పంచాయతీరాజ్, స్థానిక సమస్యలు ను కార్యకర్తలు ఎమ్మెల్యేకి వివరించారు. ప్రధానంగా భామిని ప్రధాన రహదారి పై గోతులు పూడ్చాలని మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు తెలిపారు. స్థానిక కార్యకర్తలు తన దృష్టికి తీసుకువచ్చిన ప్రతీ అంశం, శాఖల సమన్వయంతో పరిస్కారం చేస్తానని, కొన్ని అంశాలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రవి నాయుడు, ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్వరరావు, మాజీ ఎంపిపి భూపతి ఆనందరావు, జనసేన మండలి అధ్యక్షులు రుంకు కిరణ్, టిడిపి సభ్యులు బిడ్డికి ప్రసాద్, లోపింటి రాజేష్, కోరాడ రాజేష్, అశోక్, గురిబిల్లి లక్ష్మిపతి, కొల్ల మధు, టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.