మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతంగా చేయాలి : పిఒ

Nov 29,2024 21:56

ప్రజాశక్తి – సీతంపేట : స్థానికంగా జరుగుతున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మాణంలో ఉన్న ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకూడదన్నారు. అలాగే పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. మొదటి, రెండో అంతస్తుల్లో పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️