చట్టాలపై అవగాహన ఉండాలి

Oct 10,2024 21:43

ప్రజాశక్తి -సీతానగరం: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలతో పాటు చట్టాలపై అవగాహన ఉండాలని జెడ్‌పి సిఇఒ బి.సత్యనారాయణ అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వార్డు సభ్యుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అక్షరాస్య పెంచుకోవాలని, గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు వేసుకోవాలని అన్నారు. వార్డు మెంబర్ల విధులు, హక్కులపై అవగాహన కలిగించుకోవాలన్నారు. దీంతోనే గ్రామాలు, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ పి.త్రి త్రివిక్రమారావు, శిక్షకులు బి.మనోహర్‌, జి.శ్రీనివాసరావు, ఎ.శశిభూషణరావు వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్‌ : ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గత రెండు రోజులుగా పొందిన శిక్షణా తరగతులపై అవగాహన పెంచుకొని స్థానిక సంస్థల్లో పాలనకు సంబంధించి తనదైన మార్కును చూపించాలని జిల్లా పరిషత్‌ సిఇఒ సత్యనారాయణ అన్నారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గల మండల సమావేశ భవనంలో గత రెండు రోజులుగా స్థానిక సంస్థలకు చెందిన ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు పలు అంశాలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలు ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంపిడిఒ కె.రూపేష్‌, ఎఒ జి వెంకటరమణమూర్తి, సిఆర్పి జగన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️