పార్వతీపురంరూరల్: జిల్లా బాలల సంరక్షణ పర్యవేక్షణ కమిటీ పార్వతీపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో గల ప్రభుత్వ బాల సంరక్షణ కేంద్రాలను గురువారం సందర్శించింది. బాలసదనం, శిశు గృహాలను జిల్లా బాల సంరక్షణ అధికారి పర్యవేక్షణ కమిటీ సందర్శించి పర్యవేక్షణ చేసింది. ఈ పర్యవేక్షణలో భాగంగా ప్రస్తుతం ఆయా బాలల సంరక్షణ కేంద్రాల పనితీరు, రికార్డుల నిర్వహణ అంశాల గురించి నిశితంగా పరిశీలించారు. జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసర్ బివి రవికుమార్, బాలల సంరక్షణ నడుపుతున్న ఇన్చార్జులకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ భాగంలో బాలలు న్యాయ చట్టం 2015 ప్రకారం రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న కారణంగా నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయో లేదో పరిశీలన కోసం రావడం జరిగిందన్నారు. అలాగే బాలల సంరక్షణ కేంద్రాల్లో ప్రతి గదులను పరిశుభ్రంగా ఉంచుతున్నారో లేదో చూడడం జరిగిందన్నారు. అలాగే ఈ సంరక్షణ కేంద్రంలో మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయమని చెప్పారు. ఇందులో పనిచేసే సిబ్బందికి పిల్లల పట్ల బాధ్యతగా ఉండాలని తెలిపారు. ఈ కమిటీలో డిస్ట్రిక్ ప్రొహిబిషన్ ఆఫీసర్ బివి రవికుమార్, బి.శ్రీనివాసరావు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎ.సత్యనారాయణ – జిల్లా బాలల సంరక్షణ అధికారి, ఎన్. ప్రసాదరావు – ప్రొటెక్షన్ ఆఫీసర్, పి.శ్రీధర్ – లీగల్ కం ప్రొహిబిషన్ ఆఫీసర్ ఈ పర్యవేక్షణ కమిటీలో పాల్గొన్నారు.