ప్రజాశక్తి – పార్వతీపురం : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు మద్దతు తెలపాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు కోరారు. అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల న్యాయ బద్దమైన డిమాండ్లు ఆమోదించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు దిగుతోందన్నారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులను గురుకుల పాఠశాలల్లో డెప్యుటేషన్‌పై పంపించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమని చెప్పారు. ప్రభుత్వం తాజా ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలిగిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు చేస్తున్నసమ్మెను, పోరాటాన్ని నిరుగార్చేలా గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులను, గిరిజన గురుకుల పాఠశాలకు డెప్యూటేషన్ వేస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని ముక్త కంఠం తో డిమాండ్ చేశారు. ఈ మేరకు పదవ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. ఈ సందర్బంగా అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరి స్తామని చెబుతూనే ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడమే మిటని నిలదీశారు. తక్షణమే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ దీక్షల్లో అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు నిమ్మక దివాకర్, అరసాడ రమేష్, రాయల వెంకట్, తామర కండి రాజేష్, తుమ్మగుంట తిరుపతి నాయుడు, మీసాల శ్రీను, శోభారాణి, బిందు మాధవి, సింహాచల మమ్మ, లక్ష్మి, జ్యోతి, దీప, ఇందిరా, గున్నమ్మ, కుమారి, కాంచన, అనిత, కళావతి పాల్గొన్నారు.సర్పంచులు సంఘీభావంసీతంపేట : స్థానిక ఐటిడిఎ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల దీక్షలకు పలువురు సర్పంచులు సంఘీభావం తెలిపారు. వీరి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. 2022 పిఆర్‌సి ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, మోహన్ రావు, సర్పంచులు ఎన్.తిరుపతిరావు, కె.వెంకటనాయుడు, తిరుపతిరావు, ఎఎంసి చైర్మన్ మోహన్‌రావు తదితరులు ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం: అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు పోరాటాన్ని నీరుగార్చేలా వారికి డెప్యూటేషన్ వేస్తూ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. పది రోజులుగా శాంతియుతంగా పోరాడుతున్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల సమస్యలు పరిష్కరించకుండా వారిని భయపెట్టి మరింత ఆందోళనకు గురించేసేలా ఉత్తర్వులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. తక్షణమే ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకుని వారి సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే అన్ని గిరిజన, ప్రజా సంఘాలను కలుపుకుని గిరిజన శాఖ మంత్రి ఇంటి ఎదుట ఆందోళన చేస్తామని అన్నారు.