ప్రజాశక్తి – కురుపాం : కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి మెలిసి ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి అన్నారు. మండలంలోని గొటివాడలో జరుగుతున్న నిత్య జీవ ఆశీర్వాద పండగలకు ఎమ్మెల్యే సోమవారం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శాంతి దూతగా ఉన్న యేసుక్రీస్తు మార్గంలో పయనిస్తూ సన్మార్గంలో నడవాలన్నారు. అలాగే మతం అనేది మనసుకు మాత్రమేనని మనిషికి కాదని, కావున ప్రజలంతా సోదర భావంతో కలిసిమెలిసి ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్పర్సన్ కడ్రక కళావతి, తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, నియోజకవర్గ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి అడ్డాకుల నరేష్, కూటమి నాయకులు, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.
