ప్రజాశక్తి – సీతంపేట : ఉన్నతి పథకం ద్వారా డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు ఇచ్చిన ఉన్నతి రుణాలను వెంటనే రికవరీ చేయాలని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఎపిఎం, సీసీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఉన్నతి రుణాల రికవరీ చాలా పెండింగ్ ఉందని, కావున రికవరీ వేగవంతం చేయాలని అన్నారు. 7 టిపిఎంయు మండలాల పరిధిలో రూ.7 కోట్ల 67 లక్షలు రికవరీ పెండింగ్‌లో ఉందని, అందులో సీతంపేట మండలంలో రూ.3 కోట్ల 22 లక్షలు రికవరీ పెండింగ్‌లో తెలిపారు. రుణాలు చెల్లించని లబ్ధిదారులపై ఆర్‌ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే విడివికెలను బలోపేతం చేయాలన్నారు. వీడివీకేలకు వచ్చే నిధులను సభ్యులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలన్నారు. బుక్ కీపింగ్ వర్క్‌ను పక్కాగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎపిడి సన్యాసిరావు, డిపిఎం రమణ, అన్ని మండలాల ఎపిఎంలు, సీసీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
