కవయిత్రి మొల్ల రచనలు ఆదర్శనీయం

Mar 13,2025 21:05

పార్వతీపురం : కవయిత్రి మొల్లమాంబ రచించిన రచనలు అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. వాల్మీకి రామాయణాన్ని పామరులకు సైతం అర్థమయ్యేలా తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మొల్ల అని గుర్తుచేశారు. ఆ రోజుల్లో దైర్యంగా రచనలు చేశారని, ఆమె చేసిన సేవలకు గుర్తుగా మొల్లమాంబ జయంతిని రాష్ట్ర పండుగల ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్‌ మొల్ల చిత్ర పటానికి పూలమాలను వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ సబ్‌ కలెక్టర్లు అశుతోష్‌ శ్రీవాస్తవ, సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, డిఆర్‌ఒ కె.హేమలత, కెఆర్‌ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్‌ పి.ధర్మచంద్రారెడ్ది, జిల్లా బిసి సంక్షేమ సాధికారత అధికారి ఎస్‌.కృష్ణ, జిల్లా శాలివాహన సంఘ అధ్యక్షులు కొత్తూరు శంకరరావు, కార్యదర్శి ఉరిటి యాదవ్‌, తెప్పల శ్రీను, ఉరిటి సింహాచలం, ఉరిటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️