ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: గుమ్మలక్ష్మీపురం మన్యంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రజలు మలేరియా, వైరల్ వంటి విష జ్వరాల బారినపడి భద్రగిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో విషజ్వరాలు వ్యాపిం చడంతో ఆసుపత్రిలో రోగుల సంఖ్య అధికంగా పెరగడంతో మంచాలు చాలక ఒకే మంచంపై ఇద్దరి, ముగ్గురికి వైద్యం అందిస్తున్నారు. రోజుకు 200 నుంచి 250 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తున్నారు. 50 పడకల ఆసుపత్రిగా పెంచిన బెడ్లు మాత్రం 35 వరకు మాత్రమే ఉండడంతో రోగులకు చాలని పరిస్థితి. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే పూర్తిస్థాయిలో రోగులకు సేవలందించడానికి వీలుంటుందని వైద్యులు రౌతు రవికుమార్ తెలిపారు. రోగులకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు.తాడికొండలో పర్యటించిన మలేరియా అధికారి మండలంలోని తాడికొండ గ్రామాన్ని జిల్లా మలేరియా అధికారి రామచందర్రావు మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలిం చారు. జ్వర లక్షణాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. దోమల లార్వాను పరిశీలించారు. ఇంటింటికీ జరుగుతున్న స్ప్రేయిం గ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంటిఎస్ జి.కేశవరావు, సూపర్వైజర్ శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ రామకష్ణ, ఉన్నారు.
