ప్రజాశక్తి – వీరఘట్టం : గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ప్రజాప్రతినిధులు, అధికారులు సమయం వచ్చినప్పుడల్లా ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆచరణలో మాత్రం ఎక్కడా కానవడంలేదు. మేజర్ పంచాయతీ వీరఘట్టంతో పాటు పలు గ్రామాల్లో ఎక్కడికక్కడి దర్శినమిస్తున్న చెత్తకుప్పలే ఇందుకు ఉదాహరణ. మండల కేంద్రంలోని సొండి, రెల్లి, కస్పా తదితర వీధులతో పాటు నడుకూరు, కిమ్మి, చలివేంద్రి, చిట్టపూడివలస తదితర గ్రామాల్లో అపారిశుధ్యం తాండవిస్తుంది. ఎప్పటికప్పుడు కాలువలో పూడికలు తొలగించకపోవడంతో వాటిపైన దోమలు స్వైరవిహారం చేయడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. గత కొంతకాలం నుంచి కాలువలో చెత్తాచెదారాలు తొలగించకపోవడంతో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాల్లో అపారిశుధ్యం విలయతాండం చేస్తున్నాయి. ప్రకటనలకే పరిమితంగ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఈనెల 17నుంచి మండలంలో స్వచ్ఛత హీసేవ కార్యక్రమం ద్వారా పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రచారం మూడు రోజులు ముచ్చటగా మారిందే తప్ప ఎక్కడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అధికారులు మమ అనిపించుకున్నారు. ప్రచారాలపై దృష్టి పెట్టకుండా పారిశుధ్యంపై దృష్టి పెట్టి ప్రజల ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.రోగులతో నిండిన ప్రైవేటు క్లినిక్‌లుపారిశుధ్యంతో పాటు అడపా గడపా కురుస్తున్న వర్షాలు పారిశుధ్యంతో పాటు అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలడంతో ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు రోగులు ప్రైవేట్ క్లినికులకు పరుగులు తీస్తున్నారు. వేలాది రూపాయలు వెచ్చించి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, స్థానికులు తీవ్రఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే పారిశుధ్యం మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
