ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్ : తపాలా శాఖలో జరుగుతున్న ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఆపాలని పోస్టల్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జెఎసి కార్యాచరణ సంఘం పిలుపుమేరకు మూడు రోజుల పాటు బ్యాడ్జీలు ధరించి నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం స్థానిక ప్రధాన పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ఎదుట ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిడిఎస్ ఉద్యోగులకు 8వ పేకమిషన్ అమలు చేయాలని, కమలేష్ చంద్ర కమిటీలోని సానుకూల అంశాలను వెంటనే అమలు చేయాలని, ఐడిసిసిడిసి ప్రతిపాదలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రవీంద్రనాథ, బి.ఉమాశంకర్, ఎం.అప్పారావు, గౌరీశంకరావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
