సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్క రించాలి

Mar 12,2025 21:24

ప్రజాశక్తి -గరుగుబిల్లి:  ప్రభుత్వ భూములు ఆన్లైన్‌లో నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉందని పార్వతీపురం సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ అన్నారు. స్థానిక రెవెన్యూ కార్యాలయాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. అలాగే తహశీల్దార్‌ పి.బాలను ప్రభుత్వ భూములు ఆన్‌లైన్‌, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు తెలియజేసిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. దలైవలసలో చేపడుతున్న రీసర్వేలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఎస్‌ ఎస్‌ జి ప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.

➡️