ప్రజాశక్తి-కొమరాడ: విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటనకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యాన కొమరాడలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కె.సాంబమూర్తి మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను విరమించు కుంటున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ 43 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న రైతు జగత్ సింగ్ దలేవాల్ పట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. భూసేకరణ చట్టం 2013ను పునరుద్ధరించాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, రైతులకు, వ్యవసాయ కూలీలకు పింఛను ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.