నూతన మద్యం పాలసీపై నిరసన

Oct 2,2024 21:46

 ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా మహిళా సంఘాల ఐక్యవేదిక, సిఐటియు ఆధ్వర్యాన బుధవారం పట్టణంలో నాలుగురోడ్ల కూడలిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి అందించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.ఇందిర, సిఐటియు జిల్లా కోశాధికారి జి.వెంకటరమణ, ఐద్వా నాయకులు సత్యవతి మాట్లాడుతూ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా చూస్తోందని మండిపడ్డారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేసి ప్రజల ఆరోగ్యంతో మద్యం చెలగాటమాడుతుందని, ఈ రకమైన మద్యం విధానాన్ని ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్‌ చేశారు. బడి, గుడి, జనవాసాల మధ్య మద్యం షాపులు పెట్టరాదన్న నిబంధన ఉన్నా యదేచ్ఛగా షాపులకు అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మద్యం నియంత్రించాలని, మద్యం బారిన పడే చనిపోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, సాయి లక్ష్మి, భాగ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.

➡️