‘పోడు’ పట్టాలివ్వాలని నిరసన

Jan 8,2025 21:35

ప్రజాశక్తి-పాచిపెంట : అటవీ పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని మండలంలోని వై.గొట్టూరు జంక్షన్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం గిరిజనులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి పది ఎకరాలు చొప్పున పట్టాలు ఇవ్వాల్సి ఉందని, ఎక్కడా అలా ఇవ్వడం లేదని చెప్పారు. ఎకరా, రెండు ఎకరాలు ఉన్నా 60 సెంట్లు, 20 సెంట్లు ఇలా కొలతలు వేసి ఇవ్వడం గిరిజనులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. దీనిపై గిరిజనులందరినీ కూడగట్టి పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైస్‌ సర్పంచ్‌ సేబి రామయ్య, గిరిజనులు కె.సోమయ్య మాట్లాడుతూ పట్టాలు లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు.

➡️