ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

Sep 30,2024 21:15

ప్రజాశక్తి – సాలూరు రూరల్‌ : రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమశాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండలం కూర్మారాజుపేట పంచాయితీకి చెందిన బడ్నాన శ్రీరామ్‌ దొర పెన్షన్‌ మంజూరు చేయాలని అర్జీ అందించారు. పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ చింతల ఎల్లంనాయుడు మాస్టర్‌ వరద బాధితులను ఆదుకునేందుకు రూ.10వేలు ఆర్థిక సాయం మంత్రికి అందజేశారు. ఐసిడిఎస్‌ పిడి ఎంఎం రాణి, పిఒలు మంత్రి కలిసి అంగన్వాడీ కేంద్రాలకు మంజూరైన ఆర్‌ఒ ప్లాంట్లు, నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం తదితర విషయాలపై చర్చించారు. అక్టోబర్‌ 5 నుంచి ఉమ్మడి జిల్లాల పీడీలు, పిఒలు, సూపర్వైజర్లు నియోజకవర్గంలోని అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలతో సమావేశం ఏర్పాటు చేయాలని వారిని మంత్రి ఆదేశించారు. సాలూరు మండలం కురుకూటి పంచాయితీ రాంపాడుకు చెందిన గిరిజనులు తమ గ్రామంలో 350 మంది నివాసిస్తున్నామని, రోడ్డు లేదని సొంపిగాం నుండి రాంపాడు వరకు రోడ్డు మంజూరు చేయాలని కోరారు. మక్కువ మండలానికి చెందిన పూడి చిన్నమ్మలు మక్కువలో మీ సేవ సెంటర్‌ కేంద్రం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. బాధితుల సమస్యలకు మంత్రి సంధ్యారాణి సానుకూలంగా స్పందించి అన్ని పనులు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పట్టణ, మండల టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, పరమేష్‌ పాల్గొన్నారు.ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 56 వినతలుసీతంపేట: స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 56 వినతలు వచ్చాయి. ఈ గ్రీవెన్స్‌ ఈవో యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సవర బొంతు గ్రామానికి చెందిన జ్యోతి ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టా ఇప్పించాలని కోరారు. చాకలిగూడకు చెందిన రాము అంగన్వాడి భవనం మంజూరు చేయాలని కోరారు. భరణికోటకు చెందిన గోపాల్‌ తాగునీటి బోరు మంజూరు చేయాలని, బంధమానుగూడకు చెందిన నాగరాజు వృద్ధాప్య పింఛన్‌ మంజూరు చేయాలని, చిన్న మంగళాపురం గ్రామానికి చెందిన కైలాస దొర విఆర్‌ఎ పోస్టు ఇప్పించాలని, జాతపు జగతి పల్లికి సిసి రోడ్డు మంజూరు చేయాలని వసంత కుమార్‌ కోరారు. పుట్టిగం గ్రామానికి చెందిన సుదర్శన్‌ రావు కుట్టు మిషన్‌ ఇప్పించాలని కోరారు. ఈ స్పందన కార్యక్రమంలో ఎపిఒ చినబాబు, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సింహాచలం, డిడి అన్నదొర, డిప్యూటీ డిఇఒ పాలక నారాయడు, సిడిపిఒ రంగలక్ష్మి, స్పోర్ట్స్‌ ఇంచార్జ్‌ జాకబ్‌ దయానంద్‌, ఎఎంఒ కోటిబాబు, ఎపిడి సన్యాసిరావు, డిపిఎం రమణ తదితరులు పాల్గొన్నారు.సులభ్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలిసీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాసుపత్రి వద్ద మలమూత్ర విసర్జన నిర్మూలనకై సులభ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించాలని ఎస్‌సి, ఎస్‌టి మానిటరింగ్‌ జిల్లా కమిటీ సభ్యులు సవరపు రామారావు ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చిన రోగులతో పాటు సహాయకులకు అత్యవసర సమయాలలో మలమూత్ర విసర్జన చేసుకోవాలన్నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో బయట చేయవలసి వస్తుందని ఈ ఆసుపత్రిలో ప్రత్యేకించి సులభ్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పార్వతీపురం రూరల్‌: ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పోలీసు సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎస్‌పి ఎస్‌వి మాధవరెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొని, వారి ఫిర్యాదులను పరిశీలించారు. కార్యక్రమంలో మొత్తం 9 ఫిర్యాదులు అందాయి. ప్రతి సోమవారం జరిగే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ స్పందన కార్యక్రమంలో సిఆర్‌బి సిఐ వివిసిఎం ఎర్రంనాయుడు, ఎస్‌బి సిఐ జిడి బాబు, డిసిఆర్‌బి ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️