కో-ఆపరేటివ్‌ బ్యాంకులో దోపిడీయత్నం

Mar 12,2025 21:26

సీతానగరం: మండల కేంద్రంలో కోపరేటివ్‌ బ్యాంక్‌లో చోరీ యత్నం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు.. బ్యాంకులో పనిచేస్తున్న ఎటెండర్‌ బుధవారం ఉదయాన్నే డ్యూటీ సమయానికి వచ్చేసరికి తలుపులు పగలగొట్టి ఉండటంతో వెంటనే మేనేజర్‌ సూర్యనారాయణకు సమాచారం మిచ్చారు. మేనేజర్‌ పై అధికారులకు తెలియజేసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పార్వతీపురం రూరల్‌ సీఐ ఎస్‌ గోవిందరావు, ఇన్చార్జి ఎస్‌ఐ వై సింహాచలం, క్లూస్‌టీమ్‌ ఎస్‌క్ష్మి తేజ స్వరూప్‌ ఆధ్వర్యంలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీ, ఫింగర్‌ ఫ్రింట్స్‌ సేకరించారు. చోరీకి ప్రయత్నించినప్పటికీ దుండగులు ఎటువంటి డబ్బులు, వస్తువులు గానీ తీసుకువెళ్లలేదని బ్యాంక్‌ సిబ్బంది తెలిపారు. దీంతో బ్యాంకు సిబ్బంది పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

➡️