పార్వతీపురంరూరల్: సంక్రాంతి సందర్భంగా శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన సాంస్కృతిక, సాంప్రదాయ కళా నృత్య ప్రదర్శన ఔరా అనిపించాయి. కళాభిమానుల ఉత్సాహం ఉరక లేసింది. గిరిజన, పౌరాణిక, ఏకపాత్రాభినయం,హొ జానపద, కూచిపూడి, థింసా బంద నత్యాల కళా స్ఫూర్తి వెల్లివిరిసింది. జబర్దస్త్ నటుడు శాంతికుమార్ హాస్య మిమిక్రీ నవ్వులనుపూయించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ దంపతులతో పాటు ఇతర శాఖల జిల్లా అధికారులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ, సాంస్కతిక ప్రదర్శనలుగణేశ స్తుతి నాట్య ప్రదర్శనతో జిల్లా కలెక్టర్ దంపతులను స్వాగతాన్ని పలికారు. మక్కువ మండలం విబిపురం సాయి బందం ప్రదర్శించిన తప్పెట గుళ్ళు, పూర్ణిమ, దేవిశ్రీ శిష్య బందంహొమూషిక వాహన నృత్యాలు, మాధురి, శ్రావణి బృందం స్వాగత కష్ణా, శాంతినికేతన్ స్కూల్ చిన్నారుల టం టం పాటకు బంద నత్యాలు, అరసాడ జెడ్‌పి హైస్కూల్ బాలికల కోలాటం అందర్నీ ఉర్రూతలూగించింది, పెద్దూరు మర్రాపు నారన్నాయుడు ప్రదర్శించిన నారద ఏకాభినయం, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన థింసా బంద నత్యాలు అందరినీ ఉత్తేజపరచాయి. వేయినామాల వాడా… వెంకటేశా బంద నత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘల్లు ఘల్లు జానపద బంద నత్యాలు ప్రదర్శించింది. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ,హొడిఆర్‌ఒ కె.హేమలత, అధికారులు, కళాభిమానులు, తదితరులు పాల్గొన్నారు.