ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : మండలంలోని టేంకసింగి, కోసింగిభద్ర మండల పరిషత్ పాఠశాలలు, అంగన్వాడి విద్యార్థులు గురువారం సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కురుపాం నియోజకవర్గ ఇంఛార్జి, ఇరిడి ఎంపిటిసి కడ్రక మల్లేశ్వరరావు విద్యార్థులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి సంక్రాంతి వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయ వేసాధారణ దుస్తులతో విద్యార్థులు భోగిమంటలు, గొబ్బెమ్మలు, పిండి వంటలు ఆటపాటలతో గడిపారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయులు గజపతి ఝాన్సీ, మహాలక్ష్మి, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.భామిని: స్థానిక ఆదర్శ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ముగ్గులు పోటీలు, గాలిపటాలు, పిండి వంటలు ప్రదర్శన, సాంప్రదాయ దుస్తులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు శ్రీనివాస్‌రావు, భాస్కర రావు, ప్రిన్సిపాల్ రఘుపాత్రుని శివకుమార్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ వాన పిల్లి రవి కుమార్, వైస్ ప్రిన్సిపల్ బాబు, వైస్ చైర్మన్ మండల ధనలక్ష్మి పేరెంట్స్ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు.కురుపాం : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ప్రిన్సిపాల్ వి.రామలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులు మధ్య పండగ సాంప్రదాయ దుస్తులతో భోగి మంటలు, గొబ్బెమ్మలు, సంక్రాంతి ముగ్గులు వేసి సంబరాలు జరిపారు. ఈ సంబరాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్ : మండలంలోని బందలుప్పి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు రంగోలి పోటీలు నిర్వహించారు. కోయదొర హరిదాసు వేషాలతో విద్యార్థులు అలరించగా ఆనందోత్సవాల మధ్య భోగి మంటలు వేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక శ్రీ సత్యసాయి డిగ్రీ కళాశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు. కళాశాలలో విద్యార్థినిలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వేసిన వివిధ రంగుల రంగవల్లికలు ఆకట్టుకున్నాయి. కళాశాల ప్రిన్సిపల్ అంపిలి శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ అడ్వైజర్ లక్ష్మీనారాయణ, యాజమాన్యం సభ్యులు డి.వెంకటరమణ, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బి.ప్రకాశరావు, ఎఒ సత్యం, స్కూల్ ఎఒలు కేశవరావు, కృష్ణారావు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. అలానే స్థానిక తమ్మినాయుడు స్కూల్‌లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తమ్మినాయుడు విద్యాసంస్థల ప్రెసిడెంట్ శెట్టి నారాయణమ్మ, స్కూల్ ప్రిన్సిపల్ అశోక్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.వీరఘట్టం: మండలంలోని దశమంతపురం, నడుకూరు పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉపాధ్యాయులు పట్టు వస్త్రాలు ధరించారు. భోగి మంటలు, ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, పాల్గొన్నారు.