పాఠశాలలో స్వీపర్లకు భద్రత కల్పించాలి 

Sep 29,2024 13:44 #Manyam District

స్కూల్ స్లీపర్స్ యూనియన్ డిమాండ్ 
ప్రజాశక్తి-సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం, మండలంలలో పాఠశాలలో పనిచేస్తున్న స్లీపర్ ల యూనియన్ సమావేశం సాలూరు పట్నంలో జరిగింది. యూనియన కార్యదర్శి రంగు ముద్రి లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.వై. నాయుడు మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తున్న 6000 రూపాయల జీతాన్ని ప్రతినెల 5వ తేదీలోపు చెల్లించాలని, మూడు నెలలుగా బకాయి ఉన్న జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వయసు పెరుగుతున్న వర్కర్ల కుటుంబ సభ్యులకు పనిచేందుకు అవకాశం ఇవ్వాలని, పిఎఫ్ ,ఈఎస్ఐ వర్తింపచేయాలని యూనియన్ ప్రభుత్వాన్ని కోరింది. వర్కర్ల కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేసి జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు అబద్ధం, మంగమ్మ, అచ్చియమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️