ప్రజాశక్తి – కొమరాడ : పండగకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలతోపాటు వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా తాత్కాలికంగా రోడ్డుపై ఉన్న గోతులను కప్పుతున్నట్లు స్థానిక ఎస్‌ఐ కే. నీలకంఠం అన్నారు. గురువారం అంతర్రాష్ట్ర రహదారి చోళ్ళపదం శివాలయం వద్ద ఏర్పడిన భారీ గోతులను ఆయన ఆధ్వర్యంలో జెసిబితో కప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తాత్కాలికంగా రోడ్డుపై ఏర్పడిన గోతులను కప్పుతున్నామన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారితోపాటు నిత్యం ప్రయాణాలు చేస్తున్న వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల బారిన ప్రజలు పడకుండా రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. మితిమీరిన వేగంతో వాహనాలు ప్రయణించడం వల్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. పండగ సమయాల్లో ముఖ్యంగా యువత మద్యం సేవించి రేస్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.