పత్తి రైతుల పై ఇంత నిర్లక్ష్యమా?

Sep 30,2024 21:18

 ప్రజాశక్తి – కొమరాడ : మండలంలో పత్తి రైతులపైన ఆర్టికల్చర్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని ఇప్పటి వరకు అధికారులు జాడ ఎక్కడా కనిపించలేదని సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ప్రశ్నించారు. మండల కేంద్రంలో రైతులు వేసిన పత్తి పంటలను ప్రజా సంఘాల నాయకులు ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. అనంతరం సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు ఏ ఉపేంద్ర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుల రెడ్డి శివుడు నాయుడు మాట్లాడుతూ మండలంలో 3వేల ఎకరాల వరకు పత్తి రైతులు పంట వేశారని సరైన ఎరువులు, విత్తనాలు అందక పువ్వు మొగ్గ మొత్తం రాలిపోయే పరిస్థితి ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఆర్టికల్చర్‌ అధికారులు ఎక్కడా కనిపించడంలేదన్నారు. వెంటనే రైతులు వేసిన ప్రత్తి పొలాలను ఆర్టికల్చర్‌ అధికారులు పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. అలాగే క్వింటాకు రూ.15వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, పత్తి దిగుబడి అధికంగా వచ్చేలా సూచనలు, సలహాలు, జిల్లాలో మూడు చోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

➡️