మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలకు ప్రత్యేక అలంకరణ

May 13,2024 22:20

గరుగుబిల్లి: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కురుపాం నియోజక వర్గ పరిధిలోని పెద్దూరు, గరుగుబిల్లి గ్రామ పంచాయతీల్లోని రెండు పోలింగ్‌ కేంద్రాలు మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపికయ్యాయి. ఈ మేరకు సోమవారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలుగా ఎంపికైన పెద్దూరు లోని 234, గరుగుబిల్లిలోని 236 పోలింగ్‌ కేంద్రంలో ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు వెళ్లేందుకు రైలింగ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పచ్చని తివాచీలను వేశారు.ప్రశాంతంగా పోలింగ్‌సోమవారం జరిగిన పోలింగ్‌ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. ఓట్లు హక్కును వియోగించుకొనేందుకు ఓటర్లు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూ కట్టి ఓటును వేసేందుకు సిద్దమయ్యారు. మండలంలోని కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇవిఎంలు మోరాయించడం వల్ల కొంత సమయం ఆలస్యంగా ప్రారంభ మయ్యాయి. మహిళలు అధిక సంఖ్యలో ఓట్లు వినియోగించుకున్నారు.

➡️