టెన్త్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Feb 5,2025 21:29

ప్రజాశక్తి – సీతంపేట: పదో తరగతిలో డి గ్రేడ్‌ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారని ఐటిడిఎ పిఒ సి.యశ్వంత్‌ కూమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక ఐటిడిఎలో పిఒ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపల్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి గ్రేడ్‌ విద్యార్థులను సి గ్రేడ్‌లో చేర్చడానికి ప్రత్యేక తర్ఫీదు, సబ్జెక్ట్‌ టీచర్లు ఇవ్వాలని అన్నారు. వెనుకబడిన విద్యార్థులకు టీచర్లకు దత్తత ఇవ్వాలని, సులభంగా ఉత్తీర్ణులై 50మార్కులకు ప్రశ్నలు తయారు చేయాలని అన్నారు. స్టడీ అవర్స్‌ పక్కగా నిర్వహించాలని, ఉత్తమ ప్రతిభ కనపర్చిన పాఠశాలకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం, అందించే ఆహారం ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పాఠశాల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎపిఒ చినబాబు, డిడి అన్నదొర, డిప్యూటీ ఇఒ రవి ప్రసన్నకుమార్‌, ఎటి డబ్ల్యూఒ మంగవేని, ఎఎంఒ కోటిబాబు తదితరులు పాల్గొన్నారు.హౌసింగ్‌ పనులు వేగవంతం చేయాలి : పిఒపిఎం జన్‌మాన్‌ కింద గిరిజనులకు మంజూరైన గృహా నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని అన్నారు. బుధవారం ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా పీవో మాట్లాడుతూ పనులు చేస్తున్న గృహాలకు జియో ట్యాగింగ్‌ చేసి బిల్లులు అప్‌ లోడ్‌ చేయాలన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి జియో ట్యాగింగ్‌ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎపిఒ చినబాబు, ఎంపిడిఒ గీతాంజలి, ఎఇ వెంకటేష్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

➡️