జన్‌మాన్‌ పనులు వేగవంతం : పిఒ

Jan 16,2025 20:35

ప్రజాశక్తి – పార్వతీపురం : జన్‌మాన్‌ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అశుతోష్‌ శ్రీవాస్తవ ఆదేశించారు. గురువారం స్థానిక ఐటిడిఎ కార్యాలయంలో పిఎం జన్‌ మాన్‌ కార్యక్రమంలో భాగంగా జల్‌ జీవన్‌ మిషన్‌, అంగన్వాడీ, ఆవాస్‌ యోజన, రహదారులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సవీక్షా సమావేశం నిర్వహించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ప్రతి ఇంటికి తాగు నీరందించాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారాన్ని అందించాలని, ప్రాథమిక విద్య పట్ల ఆసక్తి కల్పించాలని అన్నారు. గిరిజన గ్రామాల్లో చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన చెప్పారు. గిరిజనులందరికీ ఇళ్లు నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. మంజూరైన అన్ని ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి విజయగౌరి, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️