ప్రాణాలు తీసిన అతివేగం

Sep 29,2024 21:40

పజాశక్తి – కురుపాం : అతివేగం అనర్ధమై రెండు నిండు ప్రాణాలు బలికాగా.. ఇరువుర్ని ఆసుపత్రి పాలు చేసిన సంఘటన ఆదివారం కురుపాం మండలంలో చోటు చేసుకుంది. నీలకంఠాపురం ఎస్‌ఐ నీలకంఠారావు తెలిపిన వివరాల ప్రకారం.. కురుపాం మండలం ఆగంగూడ గ్రామానికి చెందిన బిడ్డిక జుజారి (45) తన భార్య మరియతో కలిసి ద్విచక్ర వాహనంపై దుంబిడిలో చర్చికి వెళ్తున్నాడు. అదే సమయంలో ఆవిరిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక శ్రీను (22), తన బంధువైన శ్రీధర్‌తో పాటు ద్విచక్రవాహనంతో తిత్తిరి నుంచి వస్తున్నాడు. ఎదురెదుగా వస్తున్న ఈ రెండు వాహనాలు అతివేగం కారణంగా బల్లేరుగూడ జంక్షన్‌ వద్ద ఢ కొట్టుకున్నాయి. ఈ ఘటనలో జుజురి, శ్రీను అక్కడికక్కడే మతి చెందారు. ఆ వాహనాల్లో వెనుకన కూర్చొన్న జుజారి భార్య మరితో పాటు శ్రీధర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న నీలకంఠాపురం ఎస్సె నీలకంఠారావు సంఘటనా స్థలానికి చేరుకొని క్షత గాత్రులను మొండెం ఖల్లు పీహెచ్సీకి వైద్యం నిమిత్తం తరలిం చారు. వారిలో మరియకు తీవ్రంగా గాయాలవ్వడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం మహారాజా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. శ్రీధర్‌కు గాయాలవ్వడంతో మొండెంఖల్లు ఆసుపత్రిలో చికిత్స పొండుతున్నాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు..

➡️