ప్రజాశక్తి-సాలూరు రూరల్: క్రీడలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం కార్యదర్శి ఎన్ వై నాయుడు కోరారు. సంక్రాంతి సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యాన సాలూరులోని 7, 8వ వార్డుల్లో మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులమతాల తేడా లేకుండా అందరూ కలిసి మెలసి పండుగలను నిర్వహించుకోవాలని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు తుపాకుల రాముడు, బోను ఈశ్వరరావు, బంగారు సంగీత, బంగారు విశాలాక్షి, టి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.
