ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Nov 27,2024 21:39

ప్రజాశక్తి-కొమరాడ : మండలంలోని గుణానపురంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి సకాలంలో నగదును రైతులు ఖాతాలో జమ చేస్తుందని తెలిపారు. అనంతరం రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని జెండా ఊపి ట్రాక్టరును మిల్లర్లకు పంపించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎం.మల్లికార్జునరావు, తహశీల్దార్‌ శివయ్య, మండల వ్యవసాయ శాఖ అధికారి పి. శంకరరావు, టిడిపి మండల అధ్యక్షులు ఎస్‌.శేఖర్‌ పాత్రుడు, తెలుగు రైతు అరకు పార్లమెంట్‌ అధ్యక్షులు దేవకోటి వెంకట నాయుడు, ఎంపిటిసి సభ్యులు సంతోషి, గంట వెంకట్‌ నాయుడు, నాయకులు సుదర్శన్‌ రావు, మధుసూదన్‌ రావు, పి.వెంకట్‌ నాయుడు పాల్గొన్నారు. సాలూరు రూరల్‌ : మండలంలోని మామిడిపల్లి పిఎసిఎస్‌ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎఒ అనురాధ పండా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం మిల్లుకు వెళ్లిన 48 గంటల్లో రైతుల అకౌంట్‌లో డబ్బులు జమవుతాయని తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎంవి రమణ, డిప్యూటీ తహశీల్దార్‌ రంగారావు, టిడిపి మండల అధ్యక్షులు ఆముదాల పరమేష్‌, తెలుగు రైతు మండల అధ్యక్షుడు బూస తవుడు, రామకృష్ణ, పెద్దింటి మాధవరావు, డొంక అన్నపూర్ణ, తాడుతురి తిరుపతిరావు, డొంక వెంకటరమణ, శ్రీను, పిఎసిఎస్‌ కార్యదర్శి పి.జ్ఞానేశ్వర్‌రావు, డొంక వెంకటరావు పాల్గొన్నారు.జియ్యమ్మవలస : తాల్లడుమ్మ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి డొంకాడ రామకృష్ణ, ఎంపిపి బొంగు సురేష్‌, ఎఎంసి మాజీ చైర్మన్‌ కోలా రంజిత్‌, మండల అధ్యక్షులు పల్ల రాంబాబు, జనసేన మండల అధ్యక్షులు వారణాసి శివ కుమార్‌, కొప్పల వెలమ సాధికార సమితి అరకు పార్లమెంటు అధ్యక్షులు ఎం.సత్యంనాయుడు, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు గురాన శ్రీరామ్మూర్తి, జోగి భుజింగరావు, టిడిపి సీనియర్‌ నాయకులు దాసరి రామారావు, తదితరులు పాల్గొన్నారు.

➡️