ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని విద్యార్థుల ధర్నా

Oct 30,2024 21:11

ప్రజాశక్తి-మక్కువ: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని, ఇతర విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం విద్యార్థులు ధర్నా చేశారు. తొలుత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు మాట్లాడుతూ విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. డిగ్రీలో మేజర్‌, మైనర్‌ ఆన్సర్‌ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఎఎన్‌ఎం పోస్టులను భర్తీ చేయాలని, సంక్షేమ హాస్టల్లో వార్డెన్లను, వర్కర్లను వెంటనే నియమించాలని డిమాండ్‌ చేశారు. ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు రూ.3 వేలకు పెంచాలని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తల్లికి వందనం, పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అమలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జి.సింహాద్రి, జి.సంజీవ్‌, రంజిత్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️