విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి : ఎమ్మెల్యే

Nov 30,2024 21:12

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం:  ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సూచించారు. మండలంలోని పి.ఆమిటి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఆమె శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చదువులు ఏ మేరకు పట్టు సాధించారనే దానిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు రాబట్టారు. పదో తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే కష్టపడి చదవాలన్నారు. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధ్యాతనిస్తుందని, గిరిజన విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల టిడిపి ధ్యక్షులు పాడి.సుదర్శనరావు, ఎంపిడిఒ సాల్మన్‌ రాజ్‌, ట్రైకర్‌ బోర్డ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ పువ్వల లావణ్య ఉన్నారు.

➡️