కురుపాం : గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల చదువులను కాపాడాలని గిరిజన సంఘం నాయకులు ఎం.శ్రీనివాసరావు, కె.సీతారాం, వాసు కోరారు. గురువారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ గురుకుల పాఠశాల సిఆర్‌టి ఉపాధ్యాయులు నేటికీ 15 రోజులుగా ధర్నా చేస్తున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదన్నారు. దీంతో గిరిజన విద్యార్థుల చదువులు మసకబారిపోతున్నాయని కావున తక్షణమే ప్రభుత్వ స్పందించి అవుట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు రెగ్యులర్ చేసి గిరిజన విద్యార్థులకు విద్యను అందించేలా చూడాలని నాయకులు కోరారు. అనంతరం తహశీల్దార్ ఎం.రమణమ్మకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాజు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.