ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం : నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ స్టూడెంట్స్ (ఏకలవ్య) అరకువాలీలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో స్థానిక ఏకలవ్య పాఠశాలకు చెందిన (కో-ఎడ్యుకేషన్) విద్యార్థులు మంచి ప్రతిభను కనబరిచారు. యోగ అండర్-14 బాలుర విభాగంలో 8వ తరగతి విద్యార్థి ఆర్య నంద్ బంగారు పతకం సాధించగా, ఆరో తరగతి విద్యార్థి దినేష్ రజతం, ఏడో తరగతి విద్యార్థి సిద్ధార్థ కాంస్య పతకాలు సాధించారు. బాక్సింగ్‌లో అండర్-19 53కేజీ బాలుర విభాగంలో మోహన్‌రావు బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. వాలీబాల్ అండర్-19 బాలుర విభాగంలో ఇంటర్ మొదటి సంవత్సరం (బైపిసి) విద్యార్థి బి.విజరు, ఖో-ఖో అండర్-19 గర్ల్స్ విభాగంలో నీలవేణితో పాటు మిగతా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి క్రీడల్లో యోగ -14 బాలుర విభాగంలో విన్నర్స్, ఆల్ రౌండ్ ఛాంపియన్ షిప్ సాధించడం పట్ల ప్రిన్సిపల్ వీర్‌సింగ్, వ్యాయామ ఉపాధ్యాయుడు – రాహుల్ కుమార్ అభినందించారు. డిసెంబర్‌లో చత్తీష్‌ఘడ్‌లో జరిగే జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు.