ప్రజాశక్తి- పార్వతీపురం : రాష్ట్రంలోని లక్షలాదిమంది విద్యార్ధు లు, యువకులను టిడిపి కూటమి ప్రభుత్వం నమ్మించి మోసగించిందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర అన్నారు. బుధవారం నిర్వహించిన యువత పోరులో భాగంగా డిఆర్‌ఒ కె.హేమలత కు రాజన్నదొర, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు జోగారావు, కళావతి వినతిపత్రం అందించారు. అనంతరం రాజన్నదొర మాట్లాడు తూ విద్యార్థులు, యువకుల ఆశలను కూటమి ప్రభుత్వం అడియాసలు చేసిందన్నారు. పేద విద్యార్ధుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద నిధులు విడుదల చేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు భృతి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి పది నెలలుగా ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ కేలండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి మోసంగించి దన్నారు. మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ వైసిపి హయాంలో 17 మెడికల్ కాలేజీలు మంజూరు కాగా, వాటిలో ఐదు కాలేజీలను ప్రారం భించామని చెప్పారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మెడికల్ కాలేజీ లను రద్దు చేయడం వేలాదిమంది యువకుల ఆశలను ఒమ్ము చేయడమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే జోగారావు మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలో అన్ని వర్గాల ప్రజలనూ నిలువునా మోసం చేసిందన్నారు. అంతకు ముందు ఆర్‌టిసి కాంప్లెక్స్ నుంచి జిల్లా వైసిపి అధ్యక్షులు పరీక్షిత్తు రాజు, మాజీఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యాన ర్యాలీ ప్రారంభించి కలెక్టర్ కార్యాలయం వరకు సాగిం చారు. అయితే అన్న క్యాంటీన్ జంక్షన్ వద్ద పోలీసు లు ర్యాలీని అడ్డుకున్నారు. కలెక్టరేట్‌కు వెళ్ళకుండా బారికేడ్ వేశారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకు లను కలెక్టరేట్ లోపలికి అనుమతించారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యే కళావతి, వైసిపి సీనియర్ నాయకులు డి.శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి మావుడి శ్రీనివాసరావునాయుడు తదితరులు పాల్గొన్నారు.
