ప్రజాశక్తి-పార్వతీపురం మన్యం జిల్లా : గరుగుబిల్లి మండలం సుంకి సమీపంలో కారు లారీని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. పార్వతీపురం నుండి గుమ్మ వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతుడు కురుపాం మండలం గుమ్మ గ్రామానికి చెందిన హరిగా గుర్తించారు.
